21, నవంబర్ 2010, ఆదివారం

ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ



ఆ మధ్య హిందూ కార్టూనిస్టు సురేంద్ర గారితో కీపిన్ టచ్చులో వుండగా ధన్ మని ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు దర్శనమయ్యారు.
మా ముగ్గురిమధ్య ముక్కోణపు ప్రేమ ముగిశాక ఎఫెక్ట్ కోసం నేను గీసిన క్యారికేచర్ మీరు అతిత్వరలో అందుకోబోతున్నారనే సరికి తన బుగ్గసొట్టలు నవ్వినట్టనిపించింది.
ఇంకా గడ్డం కుంచించవచ్చు..నోసు నొక్కవచ్చు..మీసాలు లాగవచ్చు..దవడలు పీకనూవచ్చు..కానీ.,
గౌరవంతో కూడిన సిగ్గువల్ల ఏర్పడ్డ భయం వల్ల ఇంతకన్నాఎక్కువ లాగలేకపోయా మరి..!

4 కామెంట్‌లు:

  1. అబ్బ సుబ్రహ్మణ్యంగారూ దిగిపోయారు,అదిరింది. చాలా బావుంది. ఆయన సంతోషిస్తారు ఇది చూస్తే, ఇంతకీ పంపించారా లేదా?

    రిప్లయితొలగించండి
  2. ఇంకా పంపలేదు..అదిరిపోయినట్టు తెలిసింది అభిజ్ణవర్గాలద్వారా..

    రిప్లయితొలగించండి
  3. హలో
    మధ్యాహ్నం ఎండలో కాసేపు మన నవ్వుల జల్లు కొంత చల్ల బరిచింది.
    ఈ మధ్య నేనూ మార్గదర్శి లో చేరాను. మీ అంత కాకపోయినా బొమ్మలు వేస్తున్నాను (ప్రజాశక్తి పత్రికకి). మీ నిండు బ్రష్ గీతకీ, అన్వర్ 'ఎండు' కుంచె వాతకీ దరిదాపుల్లో లో లేను కానీ, ఎలా వున్నాయో చెబుతారని కొన్ని మచ్చుకి.
    ఇవి సరదా కే, దుడ్లు రాలడం లేదు. అవి రాలే మార్గం చూపి మీరూ నా మార్గదర్శి అవ్వరూ. ప్లీజ్.
    విజయ్
    పి ఎస్ : మోహన్ పుస్తకాలేవో ఇస్తానన్నారు (మోహన్ కాదు, మీరే). ఊరించి ఊరకుండిపోతే ఓర్చుకోవడం కష్టం. త్వరగా ఇచ్చి నా ఆత్మ శాంతి కి దోహద పడతారని ఆశిస్తాను. ఓ సాయంత్రం ymca ప్రాంతంలో చాయ్ చప్పరిస్తూ నిలబడదాం.

    రిప్లయితొలగించండి
  4. విజయ్ గారికి .,
    మీ బొమ్మలు ఆవేదనాత్మకంగానూ,మీ రచన ఆలోచనాత్మకంగానూ తోచింది..మీ సందేహాలు రాంగ్ టైమ్ లో రాంగ్ పర్సన్ ని అడిగారు..
    బొమ్మలు గీస్తూ పోతూ పోతూ వుండగా బొమ్మపండునో,లేదో తెలియదు కానీ,దుడ్ల చింత తీరును ..భ్రమ తొలుగును..భ్రాంతి మిగులును..
    ఆనక,దుడ్ల సంపాదనకు మార్గదర్శీ లాంటి చిట్ ఫండ్ కంపెనీ తెరిచే ఆలోచన ఉదయించును..
    _________________సర్వేజనా సుఖినోభవంతు­­­­____________________

    రిప్లయితొలగించండి