9, డిసెంబర్ 2010, గురువారం

తరతరాలతలరాతలతరాలు



మానాయిన రేడియోలో అక్కినేని నాగెస్రావ్ సైన్మా పాటలు వినుకుంటా ఇనాయకుడి బొమ్మనేసాడు..నేను యూట్యూబులో అక్కినేని నాగార్జన డాన్సులు సూస్తా ఇనాయకుడి కార్టూనేసా...నా కొడుకు ఐపాడ్ లో అక్కినేని నాగసైతన్య పాటలు వింటా ఇనాయకుడి బొమ్మ గీసాడు.
అచ్చం మానాయిన ఇందిరాగాంధి బొమ్మనేసినట్టే నేను రాజివు గాంధి కార్టూన్లు గీసినట్టే మావోడు రాహులుగాంధి ఆనిమేసను సేసి సూపెట్టేటట్టుంది ఆడి వాలకం సూస్తుంటే..
సిట్టసివరికి తొట్టతొల్త ఎట్టకేలకు ఇంకోడు తయారయ్యిండు మూడొతరానికి... మా ఇంటిమీద మూడో ప్రమాద సూచిక ఎగురుతోంది.....పైపోటోలో క్యూపద్ధతిల కూసున్న త్రీ జనరేషన్ ఆఫ్ గనేషాస్ సాక్షిగా..
మా నాయిన చనిపోయినంక సరింగ తొమ్మిదినెల్లకు పుట్టిండు మావాడు..అందుకే అంతా జూ.రామ్ లింగం అంటుండ్రు.
వాడు సదివేది దూగ[రొండో తరగతి] అయినా ఆడు కూసుంటె గనపతి లేస్తే గనపతి పనుకుంటె గనపతి..రాత్రికి రాత్రి ఇంటిని గనపతి ఉత్పత్తికేంద్రం చేసిపడేస్తాడాడు.
దూల్ పేటకు సీజనుందేమోగానీ,ఈడికి మాత్రం లె.
ఆడిప్పుడు మాస్కుతీసిన ఫాంటమ్ లెక్కన,శ్రీవిద్య స్కూలు డ్రెస్సేసుకున్న సూపరుమ్యాను లెక్కనా,కురుకురె కరకర నమిల్తూ డోరెమాన్ చూసే స్పైడరు మ్యాన్ లెక్కన, మఫ్టీలో వున్న మిస్టరు బిన్ లెక్కన కనబడ్తడు...
మనపిచ్చిగానీ,కలెక్టర్ మనవడు కండక్టర్ అవుతాడా..కాంట్రాక్టర్ మనవడు ట్రాక్టర్ తోలుతాడా..తాత ఫాక్షనిస్టయితే మనవడు పత్తిత్తవుతాడా ఎక్కడన్నా?

"ఈజిట్ ఇన్ హెరిడటరీ ఫాక్టర్?" అన్న అంశం మీద యాడ్లులేని దినపత్రికలపుటల్లో పుంఖాను పుంఖాల సచిత్ర వ్యాసాలు రావాలి. ఇరవైనాలుగ్గంటల నూసు చానల్లల్లో బ్రేకుల్లేని చర్చ జరగాలి ఒకేళ జరగకుంటే ఎందుకు జరుగుతలేవ్ అన్న అంశం మీద చర్చ జరగాలి...!

7 కామెంట్‌లు:

  1. హ హ హ అయితే మీ నాన్నగారి కళ "ఆరాధన" కార్యక్రమానికి మీరు "వారసుడు" అయితే, మీవాడు అదే పంధాలో మాంచి "జోష్" గా ఉన్నాడన్నమాట. :)

    రిప్లయితొలగించండి
  2. hahaha.. nice post.. first time seenur blog.. and got interest. as i am also interested insome painting.. nice pics.. and read abut ur friend pandugaaru and seen his paintings too.. nice ones.. and felt good reading about him

    రిప్లయితొలగించండి
  3. రాధ గారికి కామెంటినందుకు ధన్యవాదాలు..
    మీ బ్లాగు చూసా..టైటిల్స్ అయిపోగానే శుభం కార్డు పడ్డట్టుంది.

    రిప్లయితొలగించండి
  4. :):):)I hope! i will see 4th GEN of GANESHA :)

    Dattatreya

    రిప్లయితొలగించండి