26, డిసెంబర్ 2010, ఆదివారం

గడ్డిపువ్వు గడ్డికరిచింది


ఐ అబ్జెక్ట్ యువరానర్ !
పికిలిపిట్టను చూశాం.ఇప్పుడది మ్యూజికల్ నొటేషన్ రొదచేయట్లేదు.ప్రపంచీకరణ పక్కవాయిద్యానికి బోరున ఏడుస్తూ ప్రకృతిని ఖాళీ చేసి పత్తాలేకుండా పోయింది..ఇప్పుడు మిగిలింది ట్విట్టర్ పిట్టే.
మబ్బుల్ని చూశాం..అవి ఏట్లోకి వంగిచూడట్లేదు..టోల్గేటు ఎత్తేసింది..మేఘమధనం అంటూ ప్రాణంతీస్తారాని వసంతమేఘంతో కలిసి పరుగోపరుగు.
గట్టుమీది గడ్డిపూలు మెల్లగా ఊపడానికి వాటికి తలలు లేవు."సెజ్"లు సజ్జాల్లా వలిచి నోట్లో వేసుకొని ఖతం చేశాయి.. గడ్డిపువ్వు గడ్డికరిచింది.the grass blade has cut itself!..కాంక్రీట్ జంగల్ లోని గడ్డపూవు హెల్మెట్ పెట్టుకుంది..దానిపిచ్చిని మేమూ తలకెక్కించుకున్నాం..మేమూ హెల్మెట్ వాడుతున్నాం.
కొండల్ని పరాయిదేశాలకు ఎక్స్ పోర్టు చేసే ఎక్సుపర్టులు పంచభూతాలను పంచామృతాలుగా స్వాహాచేసిన సంసారుల రాజకీయాలు గ్లోబును కమ్ముకోక ఏం చేస్తాయి?
మీరు వర్ణించిన ప్రకృతి సైనవుట్ చేసి చాలారోజులయ్యింది.
నోస్టాల్జియా మాకు రొమాంటిక్ గానే వుంది ఆదిత్యాచానల్లో భాలకృష్ణ,సుహాసిని పాటలు చూసిన ప్రతీసారీ తెలుస్తూనే వుంది.మిలియన్ల జనాన్ని నరికిన మంగోలుల చరిత్ర ఎవడిక్కావాలి?రక్తచరిత్ర పైరేటెడ్ సి.డి లు దొరుకుతుంటేనూ..
డావిన్సీ,మైకెలాంజిలోల గురించి ఆదివారం ఆబిడ్స్ ఫుట్ పాత్ పై తెలుగు అనువాదాలుకొనుక్కొనికూడా చదివిన అనుభవాలులేవు కానీ, గోల్డ్ స్పాట్ తాగుతూ బ్లాగ్ స్పాట్ రాసి జనాలను బరస్ట్ చేయగలం..ప్లేటో,అరిస్టాటిల్,రికార్డో,కార్ల్ మార్క్స్ లను చదవడం కాదుకదా కనీసం వాటిపేర్లు కుదురుగా రాసి పలకలేము..
వ్యవస్థ గురించి తెలియదు,మేము ఎడ్యుకేటెడ్ కాదు,మాకు నాలెడ్జ్ లేదు అయినా కరెప్ట్ అవుతాం....అయినా మా అందానికి రేటుంది.
గొర్రెల్లా,బర్రెల్లా ఈ మందల్లో పడి కొట్టుకుపోతాం..
గుండెకు పట్టిన తుప్పునొదిలించడం సాధ్యంకాదు..ఎందుకంటే ఆ తుప్పు గుండెను ఎప్పుడో వదిలించింది.
కాలంతో పరిగెత్తలేకపోతున్నాం..భవభందాలు ఏ కీలుకాకీలు పట్టుకుపీక్కుతింటున్నాయి..కూపస్థం దాటి రావడానికి ఈ బండబారిన మండూకాలకు సాధ్యంకాదు.
పోయిన దశాబ్ధాన్ని పొమ్మని లాగి తన్నగలము కానీ,ముందుకు నడవలేము..మీరొక్కరే వెళ్ళండి..అది మీకే సాధ్యం.

5 కామెంట్‌లు:

  1. konni saarlu knowldge yekku vaite santosham duramavtundi. tineppudu annanni aaswadinchali kani vari yelapandutundi, dani shastriya namam, raitu kashtalu, input subsidy yivvani kirankumar reddy prabutvam, ysr uchita vidyut, babu ratilapai zaripina kalpula gurinchi aalo chiste annam bayataku vastundi

    రిప్లయితొలగించండి
  2. ఐ ఆల్సో అబ్జెక్ట్ యువరానర్! ఏ ఇజాలు, శాస్త్రాలు, హీరోల ఆసరా లేకుండానే, ఎడ్యుకేట్ కాకుండానే గడ్డి పూలూ తలెత్తి ప్రశ్నించడం, తమను తొక్కేసే రాక్షస పాదాల్లో కసక్కున దిగబడడం ఈ దశాబ్దం అద్భుతమేనని గ్రహించాలి. కవిత్వం, కళలు సాంప్రదాయ మూసల్లో కాక, కడుపు మండిన చోట కాగడాల్లా వెలిగితే కంటికి ఆనక పోవడం కూడా ఈ దశాబ్దం దౌర్భాగ్యమే.గడ్డి పూలు బతకడానికి, మొలవడానికి కూడా తావు లేకుండా చేస్తుంటే చూస్తూ కూచునే ఆముదపు మొక్కలు,బ్లేమంతా పోయే కాలం మీద నెట్టేసి,లాగి తన్ని పంపిచేయమని సూచిస్తాయి. అది ఆ జాతి లక్షణం. ఎక్కడ, ఎప్పుడవసరమో అప్పుడక్కడ నోరు విప్పని ఈ బాపతు, చివర్లో వచ్చి అంతా తగలబడి పోతుందని గుండెలు బాదుకుంటారు,గమనించండి. కడుపులో చల్ల కదలని వాడి ప్రసంగాలకి, కడుపు మాడి గుడ్లురిమే వాడి ప్రవర్తనకి ఎప్పుడూ వైరుధ్యమే. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో, ముఖ్యంగా ఈ దశాబ్దంలో ధనవంతుడికి, పేదవాడికి మధ్య విపరీతమైన గ్యాప్ పెరిగిపోయింది. వాడికి ఇంకా పెంచుకునే ధ్యాస, వీడికి కడుపునింపుకునే పోరాటం, మరి ప్రియారిటీలు మారిపోతున్న గొప్ప సాహిత్యం, విలువల కళలు, నిజాయితీ, నెమ్మది బతుకులు...ఇవన్నీ ఎవరు సుసంపన్నం చేయాలి? ఎక్కడ వెతకాలి? కబుర్లు చెబితే తీరతాయా? నిజంగా గది దాటి బయటికి రావాలి.
    -నర్సిం

    రిప్లయితొలగించండి
  3. I agree with Mrityunjay garu.. i like your dare to write a sarcastic satire to your guru...
    i liked your way of expressing your thoughts...

    రిప్లయితొలగించండి
  4. @Venu
    thanq..its not a sarcastic satire, am saying , there is no chance to step forward as we havn't the nature as he[mohan] expressed.

    రిప్లయితొలగించండి