29, మార్చి 2010, సోమవారం

యే మాయ చేసెనో ఏమో??

మా ఇంటి పక్కాయనకు కొరల్ పెయింటర్ ఇచ్చిన పాపానికి వద్దు వద్దన్నా పర్లేదు ఉంచమని యే మాయ చేసెనో పైరేట్లీ
డవున్లోడెడ్ డీ వి డీ ఇచ్చి ఎల్లాడు.
అసలే నా సిస్టమ్ కిరన్ కుమార్ రెడ్డి పాడయ్యాడు[స్పీకర్]
హెడ్ ఫోన్స్ కొందుము కదాని షాప్ కెల్లా..వాడు హోం దియేటర్ చూపెట్టాడు..వద్దులే హోం కొన్నాక దియేటర్ ఇద్దువులే ముందు హెడ్ ఫోన్స్
చూపెట్టమన్న..దానికి హెడ్ వుండాలి కదా అన్నాడు..
కుక్క దెబ్బకు షూ కాటు..
ఇగ ఇంటికొచ్చాక సిన్మా షురూ అయింది..
సమయమంతా సమంతా వాయిస్సే..ఆభ్భాభ్భా అద్ధిరా వాయిస్ అంటే..
ఓవర్ వాయిస్ కాదది వాయిస్ఓవర్!
మాటాల్లో మళయాళ అలిపి యాస కలిపి కొడుతుంటే కేరళ నారికేళంతో పూజ చేయాలనిపించింది.
సీన్ ఆఫీస్ కు షిఫ్ట్ అయింది..నా డెస్క్ నిండా ఫ్లాష్ యానిమేటర్ శివ గీసిన సమంతా పోట్రయిట్లే..
అన్నా !చాన్సొస్తే సమంతకు సీమంతం చేసేస్తానన్నా అన్నాడు..
వెల్డింగ్ చేసిన నాగచైతన్య మూతి మీద ఒట్టన్నా అని కూడా అన్నాడు.

1 కామెంట్‌:

  1. home theatre-headphones...కుక్క కాటుకు చెప్పు దెబ్బ . awesome!!!

    మిమ్మల్ని అభిమానించలేకుండా ఉండలేకపోతున్నాను ...మీరు ఒప్పుకుంటే మీ ఫాన్ అని చెప్పుకుంటాను..ఎమంటారు ? (గుడి మాత్రం కట్టించలేనండి !!! )

    రిప్లయితొలగించండి