నేను నైన్తు కిలాసులో ఉన్నప్పుడు మా ఇంగిలీసు టీచరు సుమతి మేడం పాటం చెప్తా టెక్స్ట్ బుక్కు ఇవ్వమన్నప్పుడు మా ముందు బెంచి పిలగాల్లం పుస్తకం ఇవ్వడానికి పోటీలు పడేవోళ్ళం..మా పుస్తకం సూస్తూ మేడం పాటం చెప్పడం అంటే మాకారోజు ఆనందం అంబరాన్ని తాకడమే...
ఒకానొకసారి నేను అట్లా ఇవ్వడానికి పుస్తకం తీసేసరికి నా ఇంగిలీసు బుక్కు నుంచి నేను ఇస్టంగా గీసి దాచుకున్న బొమ్మ రాలి కింద పడింది..ఓ చేత్తో నేనిచ్చిన పుస్తకం తీసుకుంటూ మరో చేత్తో కిందపడిన బొమ్మ అందుకుంది సుమతి మేడం..ఏంటా అంటూ మడత విప్పి చూసే సరికి బిఫోర్ మ్యారేజి..ఆఫ్టర్ మ్యారేజి అంటూ బొమ్మ కనబడే సరికి కళ్ళు పెద్దగా చేసి నవ్వింది..ఒకే బొమ్మ రెండు క్యాప్షన్లు ..అమ్మాయి బొమ్మ నవ్వుతా వుంటది కింద బిఫోర్ మ్యారేజి..పేపరు తలకిందుల చేస్తే అదే బొమ్మ మగాడై ఏడుపు మొగం పెడతాడు.. కింద ఆఫ్టర్ మ్యారేజి ....ఆ బొమ్మ మ్యాజిక్కు,క్యాప్షను తాలూకు ఫిలాసఫి సుమతి టీచరుకు తెగనచ్చింది..ఆ పిరేడు సగం నన్ను పొగడడానికే సరిపోయింది..ఆ కాన్నుంచి నేను రోజుకో డ్రెస్సు మార్చేవోన్ని ఎందుకంటే అంగి కాలరు ఎగరేసి ఎగరేసి మాసిపోతుండేది మరి..
పిరేడు అయిపోగానే ఆ బొమ్మ కాయితం తిరిగి ఇవ్వకుండా ఎళ్ళిపోయింది..ఓ అద్దగంట తర్వాత బెల్లు కొట్టే పిలగాడు వచ్చి మృత్యుంజయని హెడ్ మాస్టరు రమ్మంటుండు అని ఎల్లిపోయాడు..వీడొచ్చి నా గుండె బెల్లు కొట్టి పోయినాడేంటి అంటా నాకు ఒకటే వనుకు.. కంప్లైంట్లు ఇస్తే తప్ప పిలిసే బాపతు కాదు మా హెడ్ మాస్టరు లక్ష్మినారాయన రెడ్డి సారు..ఆయన సుమతి టీచరు భర్త..మక్కెలిరగ్గొడ్తా అంటూ బయాలజీ పాటం సెప్పుతుంటే సూడాలి సారు మొగం, ఎంత దయగలమారాజో.. అసుమంటి మా హెడ్ మాస్టరు పిలిసినాడంటే ఎట్లా వుంటది ఎవ్వారం...
ఇంగ నేను హెడ్ మాస్టరు స్టాఫ్ రూముకెళ్ళే సరికి అక్కడ రకరకాల టీచర్లతో రాయలవారి సభాప్రాంగణం కిటకిటలాడుతోంది..వంతులవారిగా పంతుళ్ళు నేను వెలగబెట్టిన బొమ్మని చూస్తూ నాతో నవ్వుతూ మాటలాడుతుంటే సిగ్గుతో నేను వంకీలు తిరిగిపోతుంటే సూళ్ళేక ఎళ్ళి కిలాసులో కూసోమ్మన్నారు..
ఇంగ తెల్లారిందే పాపం మా కిలాసు తెలతెల్లని గోడలన్నీ నా బొమ్మల్తోని నింపి పడేసా..నిజాకది కిలాసు అనడంకంటే ఆర్టు ఎజ్జిబిషను అనడం సమంజసం..సందర్భానుసారం నా ప్రతిభ భయటపడేది అంటే వినాయక చవితికి ఇనాయకుడి బొమ్మ,దసరాకి దుర్గా మాత, క్రిస్ మస్ కు ఏసుక్రీస్తు బొమ్మ ఇట్లా కిలాసు గోడలు నా బొమ్మల్తోని బిజీ బిజీగా వుండేయి.. సుమతి టీచరు ఇంగిలీసే కాకుండా రసాయన శాస్త్రం కూడా సెప్పేది..పరమాణు మూలకాల చార్టు హైడ్రోజను..01,హీలియం..02 నైట్రోజన్...12 ........అంటూ రాసి ఓ పెద్ద పోస్టరు తయారు సేసి బ్లాకు బోర్డు పైన తగిలించిన..
ఆ కాన్నుంచి ఆడామగా కలిసి అరవై నాలుగు మంది కిలాసు పోరల్లో నేను ఇస్పెషల్ స్టూడెంటుగా కీర్తించబడిన..అట్లాగని నేను సదువులో పోటుగాన్నేంగాదు..యావరేజి స్టూడెంటుని..
ఇహ సుమతి టీచరు చెప్పే ఇంగిలీసు గ్రామరైతే ఎంత శ్రద్ధగా ఇనేవోడినో..ఆక్టివ్ వాయిస్,పాసివ్ వాయిస్ లైతే హరికథ చెప్పినంత భక్తిగా చెప్పేది.."డేవిడ్ కాపర్ ఫీల్డ్" పాటం అయితే కంటస్తం చేసే వరకు వదిలేది కాదు..తెగిపడిన శిల్పాల పాఠం "ఒజిమాండియాస్" లెస్సన్ లో "ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ " కొటేసను ఎంత నచ్చిందంటే నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లన్నీ ఆ కొటేసనుతోనే ఓపెన్ చేసాను..రెండెళ్ళక్రితం ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ అంటూ ఆర్కుట్ లో చేరి నూటా ఇరవై మంది,ఫేసుబుక్కులో మూడొందలమంది దోస్తుగాల్లని ఆ కొటేసను కస్టమ్ మెసెజ్ తోనే గదా సంపాయించింది..
అదే ఆర్కుట్ లో ఈ మెసేజ్ చూసేసరికి గిర్రున కళ్ళెమ్మటి ఫ్లాష్ బ్యాకు దారల చారలు..
"Hi,This is Sumathi laxmareddy.I worked as a Bio science teacher in ZPHS pochampally from 1986 to 2001 did u study during that period?My husband also worked as Headmaster."
[ఇప్పుడు నేను అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసరుతో అంతో ఇంతో ఇంగిలీసు మాటలాడుతున్నా,బ్రెజిల్,బెల్జియం,టర్కీ,కజకిస్తాన్,ఉజ్బెకిస్తాన్,పాకిస్తాన్ కార్టూనిస్టుల్తో బొమ్మల సంగతులకోసం ఇ_మెయిల్ ముచ్చట్ల ఇచ్చకాల గచ్చకాయలు ఆడుతున్నానంటే ఇంగ్లీషు సరస్వతి మా సుమతి టీచరు వేసిన భిక్షే గదా!]
మీ బొమ్మను బత్తె తెలుస్థుంధి మీలొ కలకారుధు దాగి వున్నదని మీరు అప్పుదు పదిన తపనె నెతి ఈ కలాకరునీకి జీవం ఇచింధి.మీ స్చూలు తీచర్ ప్రొథ్సహం అద్బుథం.
రిప్లయితొలగించండికాసనోవాఆంటాడొక చోట,too many beautiful women,and too little life time'అని,మీరూ మంచి కోట్ చెప్పారు.
రిప్లయితొలగించండికోట్ అదుర్స్ అన్నో..కాసనోవతో కలిసి సింపి సిత్తడి చేసారు.
రిప్లయితొలగించండిno women no cry..know women know cry. ఇదెట్టుందో సూసి సెప్పు.
అదిరింది బెదరు
రిప్లయితొలగించండి@sudarshanam
రిప్లయితొలగించండితాగుడన్నా మానేయ్..లేదా తాగినాక రాయడమన్నా మానెయ్..
[సుదర్శనం గారికి క్సమాపనలతో..]
తాగెవాదు నిజం చెబుతాదు ఇది తెలియదా బాసు
రిప్లయితొలగించండిTeachers are short but their teaching is very very long.
రిప్లయితొలగించండిYou are a good student of an excellent teacher.
We are lucky to read your blogs
Ravi
Amberpet
టాంక్సో టాంక్సు..అంబరుపేటలో యాడడుంటవే నువ్వు??
రిప్లయితొలగించండిi enjoy the read and hats off to sumathi madam.
రిప్లయితొలగించండిHi bro.. a very gud morng.. dis article
రిప్లయితొలగించండిremembered my old golden School days..it doesn't matter either u r an intelligent student r an average student.. last output is how much u gained knowledge...!!!dis shows ur affection wid ur Teachers...
" OLD IS GOLD".. dis quotation suits 4r dis article.. Guru Brahma Gurur Vishnu
Guru Devo Maheshwaraha
Guru Saakshat Para Brahma
Tasmai Sree Gurave Namaha...!!!
I am indebted to my father for living, but to my teacher for living well. ~Alexander the Great
రిప్లయితొలగించండిhi,mruthyunjay,very happy to come in contact with my students like this.When u showed me ur cartoon one day in class,I thought u will become a cartoonistwhat abt ur brothers and sisters give me ur contact no.WISH U ALL THE BEST AND BRIGHT FUTURE
రిప్లయితొలగించండిMasthuga undhi Mrithyunjaya.Nee telugu bhasha achham Kaloji Narayanarao(the greatest) ni poli undhi. Naa medhadulo alochanalu gir gir gir ani thirigi mana balyanni gurthu thechhayi. Mana school ground lo chettu kindha kurchoni chadhuvukunna rojulu. School eggotti cricket choodadaniki poyina rojulu. Kalidas sir Hindi kavithyalu and paintings okkatemiti, enno ennonno. Mana madhura jnapakalu gurthu chesinandhuku marokka saari thanks.
రిప్లయితొలగించండి