10, ఆగస్టు 2010, మంగళవారం

ఓ వాలు జడ..మల్లెపూల జడ..

"వురే ! మనకు పెల్లీడొచ్చినప్పుడు పెల్లి సూపులకోసం అమ్మాయింటికి సెప్పి పోవొద్దురో..సెప్పకుండా కాల్ల సప్పుడు కాకుండా స్లో మోసన్ల మబ్బుల ఆరుపాంవుకల్లా డోరు కొట్టి అమ్మాయిని అట్ల సూసి ఇట్ల పట్ మని వచ్చేయాలి..సింపిరి జుత్తు,సొల్లు మొకం లోనే పిల్ల అందం పట్టేయాలి..లేకుంటే మనం వస్తమని తెలిస్తే పిల్లకు విగ్గులు పెట్టి ,లిపుస్టికులు,ఇస్నోలు,ఐటెక్సులు,ఐ లాషులు,పౌడర్లు రాసి మనకు మసి పూసి మాయ సేస్తార్రో..జాగురత్తా "అంటూ మా ఇస్కూలు పోరగాండ్లు చెప్పేటోల్లు...అంతేగాదు, "పిల్ల పోటోలు ఇస్తే మాత్రం సూడకుండా అసుంటా నూకెయ్యాలి,ఎందుకంటే గ్రాపిక్సులు చేసి మనల్ని ఒప్పించి పెల్లికి పిక్సు చేసి పడెస్తరు."అంటూ వార్నింగులు..
ఇంగ నా పెల్లి సూపుల ముచ్చట మగా ఇసిత్రంగా వుండేదిలే..
ఏ పిల్లని సూడ్డానికి ఎల్లినా ముందు కంటే ఎనకాలే ఎక్కువ సూసేటోన్ని.. జడ కోసం...జడ సిన్నదా?పెద్దదా? ఒరిజినలా? సవరమా? అని మగా ఎగ్జయిటింగుగా,యాంగ్జటింగుగా వుండెడిది..అసలే "జడని దువ్వనీ,పొగడని మొగడు జడపదార్థమే జడ..." అంటూ ఈ టీ.వి మనోరంజని లో బాపు సిన్మా పాటలు రెచ్చగొట్టేయి..
ఎట్లైతేనేం..సిట్టసివరికి ఆ బగమంతుడుగారు రాధిక బికాం కంప్యూటర్స్ పొడుగు జడకు సక్కగా నూనె రాసి అందంగా దువ్వి అంబరుపేటకు పంపిండు..ఇంకేం ఓ.కే అనేసిన..గ్రహ దోష నివారనకు పేరుమార్చమంటే రాధిక బికాం కంప్యూటర్స్ సుమ బికాం కంప్యూటర్స్ అయ్యింది[ఇంగా నయం జడ మార్చమన్లేదు..] "వురే సుమ అచ్చం ముందునుంచి మోహన్ బొమ్మ,ఎనక నుంచి బాపూ బొమ్మరోయ్" అంటూ నా దోస్తుగాల్లు ఒహటే సతాయింపు..
ఇంగ మోహన్ సార్ దగ్గరికెళ్ళి "సా...సా...నాకు సుమకు పెల్లి సా...నేను కార్టూనిస్టుని అని తెల్వాలి సా...జడ హైలెట్ కావాలి సా...మందిని పెల్లికి పిల్వాలి సా.."అంటూ ఓ డిస్క్రిప్షన్ రాసిచ్చినంక మోహన్ సార్ బొమ్మగీసేసరికి అంగో వెడ్డింగు కార్డు అట్ల తయారయ్యింది..
మా నాయిన కుషీ అట్లా ఇట్లా కాదు జీరాక్సులు తీసి మరీ పంచిండు..
మా ఊళ్ళో మా ఇంటి పక్కనుండే కుర్రి రాజయ్య పెండ్లాం,సంగెం లచ్చుమమ్మ,ఎలగందుల రంగయ్య పెండ్లం ఈ పెండ్లి పత్రిక పట్టుకొని మా అమ్మతోని..
"ఏమమ్మో నీ కొడుకు అప్పుడే నీ కోడలు జడ పట్టుకోని,కొంగు పట్టుకోని ఇడుస్తలేనట్టుందీ..ముందు ముందు ఎట్లనో.." అంటూ మా అమ్మను ఎగేసిండ్రు.
[పెల్లికి నూటా పదారు మంది ఆర్టిస్టులు,కార్టూనిస్టులు [రెండు వేల నాలుగు వందల మంది సుట్టాలు మినహాయించి] కలిసి చేసుకున్న పెల్లి కుషీకి,మజాకు ఈరోజుకు విజయవంతమైన తొమ్మిది సమ్మచ్చరాలు]

10 కామెంట్‌లు:

  1. నాగేస్రావ్10 ఆగస్టు, 2010 6:20 AMకి

    నీ పెండ్లిసూపుల కత సూపరుగుంది తమ్మీ!
    "ముందు ముందు ఎట్లనో.." ఊసులు కూడ ఓపాలి తెల్వజెయ్.

    రిప్లయితొలగించండి
  2. పెళ్ళిరోజు శుభాకాంక్షలు మృత్యుంజయ గారు. తొమ్మిదేళ్ళ తరువాత జడ అలాగే ఉందా? పోనీటెయిల్ అయ్యిందా :P

    రిప్లయితొలగించండి
  3. సుభలేఖ సింపుల్ గా కేక :)
    మీ వైఫ్ ఇది చూసి ఎంత మురిసిపోయి ఉంటారో కదా..
    మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. @నాగెస్రావ్
    అట్లనే..ఆ ఊసులు కూడా వెంటెంటనే..
    @నీలు
    ధన్యవాదాలండీ..మొన్నోసారీ జడ కత్తిరించి పోనీటెయిల్ చేసుకుంటానంటే నేను మీ అత్తగారింటికి నువ్వు మా అత్తారింటికి ఎల్లాల్సివుంటదని వార్నిం"గిచ్చిన".
    @sai praveen
    థాంక్యూ..సుమ మురిపెం సెప్తె సేట భారతం..రాసుకుంటే రామాయణం..!

    రిప్లయితొలగించండి
  5. పెండ్లిరోజు శుభాకాంక్షలు బెదరు.మీ మోహన్‌ సారు పెండ్లిపత్రికను ఇరగదీసిండు..:)
    గట్లైతె మేము ఇప్పటికైతె భారతం ఇనాలా రామాయణం రాస్కోవాల్నా ?

    రిప్లయితొలగించండి
  6. nee pelli muchchtlu manchi ga kottini.
    anna, vadinamma zeda appati sandi gatlane unnade ?

    రిప్లయితొలగించండి