8, ఏప్రిల్ 2011, శుక్రవారం

పతంజలి తలపులు....ఒక దెయ్యం ఆత్మకథ

నా బ్లాగులో నేను పెడుతున్న ముచ్చట్లు చూసి సంబూరపడి ఓ పెద్దాయన "పతంజలి తలపులు" బుక్కు ప్రింటింగు మధ్యలో ఆపేసి నా బ్లాగు లింకు అందగానే అచ్చేసి వజను అనుకోకుండా డజను కాపీలు తెచ్చిచ్చెళ్ళాడు.
సరసమైన ధరలకు "పతంజలి తలపులు" కావాలనుకునేటోళ్ళు ఈ నెంబరుకు ఎసెమ్మెస్ పంపండి..9848555243.

4 వ్యాఖ్యలు:

 1. ఈ పుస్తకం గురించి కొన్నవివరాలు కావాలండీ. పతంజలి తలపులు విడుదల వివరాలు పేపర్ల లో చదివి, మొన్న విశాలాంధ్రలో వెతికాను. దొరక లేదు. సరే, ఈ పుస్తకం పతంజలి గారి స్వీయ చరిత్రా ? లేక ఇతరులు వారి గురించి అడపాదడపా రాసిన వ్యాసాల సమాహారమా ? తెలియడం లేదు. ఆ మధ్య విజయవాడ పబ్లిషరు ఒకరు పతంజలి పోయేక నేను నవ్యలో రాసిన వ్యాసాన్ని పతంజలి స్మృతి సంచిక తెస్తే దానిలో వేస్తానని చెప్పారు. ఆ పుస్తకం వచ్చిందో లేదో తెలియదు. పుస్తకం వెల ఎంత ? వివరాలు తెలియజేస్తారా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జోగారావు గారూ మీ వ్యాసం అచ్చయ్యింది.పుస్తకం కావాలంటే కలవండి .. ఎసెమ్మెస్ పంపి కాపి రిజర్వ్ చేసుకోండి.ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందండీ? పతంజలి 'గ్నాపక కథలు' 'రాజుల లోగిళ్ళు' ప్రింట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాకు పతంజలి తెలీదు. ఆయన కథలు తెలుసు. ఆయనలాగే కొన్ని ఏళ్ళు 'ఆ' అంధుడి పాట వింటున్నా, చూపున్న పతంజలి దృష్టే వేరు అన్న విషయం తెలిసింది.
  మృత్యుంజయ వంటి వారు తమకు తెలిసిన తెలిసినోళ్ళు తెలుపగా తెలుసుకుని తలచుకునే అదృష్టం నాదీ, నా బోటి కోన్ కిస్కా గాళ్ళు ఎందరిదో!!
  నాకు మృత్యుంజయ తెలుసు. కుదిపి కుదిపి నవ్వే మారాజులున్న రోజులలో కలిసి మెలసి నవ్వేవాళ్ళం మేము. నాకు అతని గీతే తెలుసు. అతను కుంచె అంచులని వంచి వేసే బొమ్మలకి నేను అవాక్కయి చూసిన రోజులున్నాయి. ఇంకొన్ని రోజులు అలానే గడిస్తే నా వాక్కు మొత్తం బందు అయిపోతుందని జాలిపడి జల్ది జారుకున్నడు. కట్ చేస్తే ఒక దినం బ్లాగు ల బయట పడ్డడు.
  గీత కార్మికులందర్కి బాప్ అయిన బాపు కి ముళ్ళ వంటి కొష్ష రాత కోసం ఒక రమణ ఉండె. గా తర్వాత గస్మంటి కొష్ష గీత గాల్లైన మోహన్, అన్వర్ లకు పాపం ఎవ్వల్ తోడు లేకుండే. వాల్లు, కాపీ గొట్టినా కుదరని బొమ్మలు ఒలకబోస్తూ, మరొక చేత్తో మంచి కాఫీ లెక్క ఉండె అక్షరాలని చిలకరిస్తూ మస్తు రాస్తున్రు. (ఇయ్యాల రేపు గవీ తక్కువైనై). వాళ్ళ గీతలు చాకుల్లెక్క. వాళ్ళ రాతలు చాకు లెట్ల లెక్క.
  మృత్యుంజయుడు భీ గట్లనే. బ్లాగు భూమి ల కొత్తరకం సేద్యం చేస్తాన్నడు. బాబు గారన్నట్టు, జై బ్లాగు భూమీ.
  టుడే ఈవెనింగ్ డెఫినెట్, పక్కా అని రెట్టించి అడిగి అడిగి, కలుసుకునే రోజుల్ని కలవకుండా ఊరిస్తూ, దొర్లిస్తూ గడిపేస్తున్నా మృత్యుంజయ్, ఒన్ ఫైన్ డే (డే కామనే, మేం కలిసినందుకు 'ఫైన్' అయ్యింది), మార్నింగ్ కలిసిండు. చాయ్ పుచ్చుకుంటూ పతంజలి పుస్తకం పుచ్చుకున్నా.
  పతంజలి గురించి చెప్పడానికి ఎటువంటి అర్హతా లేని వాణ్ని. ఆయన్ని గుండెల కద్దుకున్న మృత్యుంజయ తో ఇంకా బోలెడు, ఎన్నో, చాలా, మోర్, మస్తు విషయాలు చెప్పించుకోవాలని మనసైతాంది. చెప్పనీకి అతనికి మనసవ్వోద్దూ? అన్నా. జర చెప్పరాదే?

  ప్రత్యుత్తరంతొలగించు