25, ఏప్రిల్ 2011, సోమవారం

ఊరవతల మామిడితోటలో మా ఊరి పోరగాళ్ళం.

ప్రవీణ్ గాడు,జ్ఞానిగాడు ఫోన్ జేసి "ఉరే మన టెంత్ కిలాసు బ్యాచ్ పోరగాండ్లం కలిసి సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నాం వస్తావ్ రా?"అనడిగేసరికి గుండెల్లో మా పదోతరగతి రోజులనాటి ఖైదీనెం.786 గువ్వా గోరింకతో ..పాట బిగినింగు డ్రమ్ము మోగింది.పోచంపల్లి ఊరవతల కొంగరిభాస్కర్ మావిడి తోటల మా బ్యాచి పోరగాండ్ల సెలబ్రేషన్ దావత్ ఇంతెజాం చూసే సరికి వైబ్రేషన్ వచ్చింది.ఓ పక్క పాండు గాడి పంచులు..మరో పక్క ఆడిపోరలు ఎందుకు రాలేదని దామోదర్ గాడు ఒహటే గులుగుడు ..సాహేస్ గాడేమో పిలుద్దాంరా మళ్ళీ చేసుకుందాంరా అని ఊకుంచుడే సరిపాయె.
ఇంగ తినితాగి ఇరవై ఏళ్ళక్రితం జ్ఞాపకాలు పంచుకున్నంక, గద్దర్ పాటలకు మా గద్దగాల్ల గంతులకు ..మాయదారి మైసమ్మపాటల తీన్ మార్ల అదుర్లకు తోటలోని మావిడిపిందెలు రాలి కిందపడినయ్..మేము పద్నాలుగేండ్ల పిల్లలమైపోయినం.

"ఇంట్ల పెండ్లాం,బయట బాసే కాదురా,సమ్మచ్చారానికి ఒక్కరోజైనా దోస్తుగాండ్లకోసం కేటాయించుకోవాల్రా..నామటుకు నాకేమనిపిస్తుందంటే నాకు ఉంకో పదేల్ల ఆయుష్శు పెరిగిందనిపిస్తుందిరా !" అన్నాడు సుదర్సన్ గాడు మత్తుకండ్లతో సొలుగుతూ బండి తోల్తా..

[ఈ బ్లాగులోని నా జ్ఞాపకాల పోస్టునొకదాన్ని ప్రింట్లు దీసి మా టెంత్ బ్యాచి పొలగాండ్లకు పంచిపెట్టిన ఇషయాన్ని మళ్ళి ఇక్కడ పోస్టు చేయడం జరిగింది.]

7 వ్యాఖ్యలు:

 1. ఏమి చెప్పినావు బొమ్మలాయనా! గుండె జల్లుమన్నాదనుకో.
  లైలా కాలేజిలో ఇంటర్లోచేరినప్పుడు నిర్మలా హైస్కూలు, ఇంకా గన్నారం పబ్లిక్ స్కూళ్ళ నించొచ్చిన పెద్ద తోపుగాళ్ళతో దీటుగా డాస్ పూస్ అని ఇంగ్లీషు పేలానంటే మా పాకల బడి (విద్యోదయా అప్పర్ ప్రైమరీ స్కూల్) పంతులమ్మలు పెట్టిన విద్యా భిక్షే!
  Well said!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @life is beautifull
  అవునన్నా..ఇంతకుముందు ఇదేబ్లాగులో నేను రాసుకున్న పోస్టును పైన చూపెట్టిన తరీఖా ప్రింట్లు తీసి నిన్న జడ్.పి.హెచ్. ఎస్ పోచంపల్లి మాటెన్త్ క్లాస్ బ్యాచ్ సెలబ్రేసన్లో పొలగాండ్లకు పప్పుబెల్లాలలెక్కన పంచిపెట్టిన..అన్నట్టు గడ్డాలు మీసాలు పెరిగి,జుట్టు ఎంటికలూడిన మా పొలగాండ్ల పోటోలు సూడాలంటె పేసుబుక్కుల నాతో దోస్తానా చేయి.
  @కొత్త పాళీ
  అబ్బో..మీ కామెంటుకి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మామా రచ్చ రచ్చ పో... నీ ప్రజంటేషన్ కేకో కేక... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. The "now generation" of folks have no idea what it was like to live in a "calmer" society and PERHAPS that don't want to know. But, we sure do remember...right????

  it had been so long time since i had received ur messgs, not a fonecal... anyways.. missing u a lot.. especially our GB..wid blue alto car... gud olden days.... will remain 4ever...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తియ్యని బాధ ని కలిగించేదే గతాన్ని జ్ఞాపకాలని స్పృశించడం. గడిచిన ఆనందాన్ని తలచుకుంటే ఎప్పుడూ కలిగేది అటువంటి అనుభూతే. అందరికీ. అంటే, అటువంటి బేఫికర్ జిందగీ ఇంత గలీజ్ దునియా లెక్క మారిందనే బెంగ కావొచ్చు. మరేదైనా కావొచ్చు. ఎవరి అనుభవాలు వారివి. కొందరికి గతం ఇంకా 'తియ్యని' బాధే! (మొదటి తియ్యని అనే పదం మస్తు తియ్యగా ఉండేది అనే అర్ధం లో వాడినా; రెండవ ది తియ్యలేదనే! అసలే మృత్యుంజయ మామూలోడు కాదు. 'పన్'తులు!)
  పంతుళ్ళు, పంతులమ్మలు (పైన చెప్పిన పన్ కాదు) సద్వు అడుక్కునే (విద్య + అర్ధి ) అందరికి భిక్ష వేస్తరు. కానీ అది కొందరికే వంట బడతది, వెంట బడతది, ఇంకింత మందికి భిక్షమేసే చేవ నిస్తాది. అయినా, మనం ఇంగ్లీషు వస్తేనే పెద్ద సద్వినోల్లం అనుకుంటే ఎట్ల? ఇయ్యాల మీరు తెలుగు ల బ్లాగు పెట్టినారంటే గది (ఆ గది కాదు) భీ గొప్పనే -- సద్వు గొప్పనే. ఇంగ్లీష్ ల ఎట్ల రాసినా, ఎట్ల ఊసినా ఎవ్వడు అడ్డు చెప్పడు... వానికే సక్కగా రాదు గాబట్టి, ఏమైనా సెబితే వాందే గలత్ అంటారేమో అని బుగులు బిడ్డకి. గిదే బ్లాగు అంగ్రేజీ లో గిట్ల ఉండేదా? బిల్కుల్ ఉండద్. కేకే (కేశవ్ రావ్ ) వేసే కేకల మీదొట్టు.

  డాక్టర్ విజయ్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఎర్రటి ఎండలో ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి వచ్చాక ని పోస్ట్ చదివా అదిరి పోయింది. లేత ముంజలు తిన్నట్టుంది. వాడెవడో మాండలికాల్లో రాయవద్దని వ్యాసాలు రాస్తుండు. ఓ సారి ఈ పోస్ట్ వాడికి పంపు

  ప్రత్యుత్తరంతొలగించు