22, జూన్ 2010, మంగళవారం

నా బైకు..మానాయిన సైకిలు

నా పెళ్ళికి మా అత్తగారు పెట్టిన వీరోవోండాAP24 F824 ఇస్ప్లెండరు బైకంటే నాకు మస్తు మజా..దాన్ని కొత్తలో ఎక్కితిరిగినదానికంటే కడిగి తుడిసిందే ఎక్కువ.టైర్లు అరక్కుండా గాల్లో తిప్పేవోన్ని..బైకు సీటు అనిగిపోతుందేమోనని బెంగగావుండి పైన కుసోనికుసోనట్టు నడిపేవోన్ని..నా బైకుమీద నా పనిమీదైనాసరే వేరేవోళ్ళు ఎక్కడానికి లే..అంతెందుకు నేను కిక్కు కొడితే వచ్చే ఇంజనాయిలు వాసనకూడా వేరేవోళ్ళు పీల్చడానికి ఈల్లేదంతే..దూరం ఫొ..దూరం పో..అని గెదిమేవోన్నీ..
ఎన్నడెక్కనోడు ఎద్దు ఎక్కితే ఏదో కాయకాసిందన్నట్టు..అట్టా ఎక్కి తిరిగేవోన్ని నా బైకు మీద..
నా బైకుని మా సిన్నతమ్ముడుతప్ప ఇంగే నరమానవుడు ముట్టినా భస్మం..మా సిన్నతమ్ముడు ఎందుకంటే బైకు ఆడు ఎక్కితేనే నేనెక్కేది ,అదెట్లన్నన్ నాకు డ్రైవింగు నేర్పేది ఆడే మరి.నే లేనప్పుడు వాడు నా బైకేసుకొని ఈర సివాజి గుర్రమ్మీద దౌడు తీసిన లెవల్లో వుండేది పోజు..అడ్డుకుంటే "డ్రైవింగు సగం నేర్పి వదిలేస్తా బురద గుంతలో పడి సస్తావ్ జాగురత్తా!" అని బ్లాకుమెయిలింగుకు దిగేవోడు..సరేనని కాంప్రమైజు అయ్యేవోన్ని...స్టీమింజను,ఇమానము తప్ప ఈ బూమండలమ్మీద తిరిగే ప్రతొక్క వాహనాన్ని రోడ్డురోలరుతో సహా నడిపాడు మా సిన్నతమ్ముడు..బండ్లు తోలడంలో వాన్ని మించిన పహిల్వాను మా ఊరు సరవుండు ఏరియాలో ఇంకోడు లేడు. సరే వీడెంత దూరం తిరుగుతాడోనని కనిపెట్టడంకోసం రగస్యంగా మీటరు రీడింగు రాసుకునేవోన్ని..ఆడు నాకంటే గనుడు నాచంటమల్లన్న లెక్కన మీటరు వైరు పీకేసి తిరిగేవోడు..
పూర్తిగా డ్రైవింగు నేర్చుకున్నంక "ఇంగ నా జోలికి రాకు పో రా" అంటా ఆన్ని అసుంటా నూకేసేవోన్ని..వాడు ఏడ్పు మొకంతో అటే పోకడ.
ఇంగ నేను బైకు తీసిన ప్రతీసారీ మా నాయిన తన అట్లాసు సైకిలు తీసేవోడు పోటీగా..మొదట్న ఒకట్రెండుసార్లు మానాయిన నన్ను బైకిమ్మంటే "ఇయ్యనుపో..కస్టపడి మీరు నాకు పెండ్లి సేస్తే సంపాయించుకున్న బైకిది" అన్నాన్నేను..అప్పట్నుంచి నన్నడగలే..కసిగా నా బైకుకు తాతలాగ తన సైకిలు తుడిసి ఎక్కేవోడు..ఇస్పీడుగా నడవడానికి రోజు చక్రంలో గ్రీసు ఏసుకొనేవోడు..నేను బైకు ఇస్టార్టు సేసి మొగలాయిలెక్కన ఎక్కి ఎల్తుంటే మా నాయిన నేనేం తక్కువతిన్నానా అన్నట్టు తన సైకిలు ఎక్కి అలెక్జాండరు లెవల్లో ఎళ్ళెవోడు..నా బైకు కీకీ.. కీకీ.. కీకీ.. కీకీ అంటూంటే మా నాయిన సైకిలు బెల్లు ట్రింగు ట్రింగు మంటూ వెలవెలబోయెది..అది మా నాయినకు సిన్నతనంగా తోచేది..ఇంగ ఇట్లాగాదని ఓరోజు మా ఊర్నుంచి మానాయిన సైకిలేసుకొని హైద్రాద్ తొక్కుకుంటూ తొక్కుకుంటూ జుమ్మెరాత్ బజారు చేరుకొని [మా నాయిన ఊ అంటే జుమ్మెరాత్ బజారుకొచ్చేవోడు..అక్కడ వాడిపడేసిన వస్తువుల్ని అడ్డికి పావుసేరు లెక్కన అగ్వసగ్వ ధరలకు అంటగడ్తారు] ఇస్కూటరుహార్న్ కొని సైకిలుహ్యండిలుకు బిగించి పీపీ..పీపీ..పీపీ అని హార్ను చప్పుడుచేస్తూ ఇంటికొచ్చడు ఇజయగర్వంతో ..
నా సైకిలుముందు నీ ముష్టి బైకెంతరా అంటూ సైకిలుకున్న హార్ను పీపీ..పీపీ..పీపీ అని మోగిస్తూ చెమటలుకక్కుతూ ఆయాసంతో ఎత్తుగడ్డలు బలంతాన తొక్కుతున్న మానాయిన సైకిల్ ని నా బైకుతో ఓవరుటేకు చేసి నన్నుదాటిపోవద్దని చేయితో కుడేపు సైడు చూపెట్టిన.

9 కామెంట్‌లు:

  1. హ హ హ భలే ఉంది మీ నాయనకి మీకు పోటీ. నాకు బైకు కాదుగాని చిన్నప్పుడు కొనుక్కున సైకిలు మాత్రం మీరు వాడే పద్ధతిలోనే వాడేదాన్ని. నా సైకిల్ నాకే సొంతం. మా చెల్లిని కూడా ముట్టుకోనిచ్చేదాన్ని కాదు. రోజు కడిగేసి శుభ్రం చేసేదాన్ని.

    రిప్లయితొలగించండి
  2. ఏమనొకోకపోతే ఓ చిన్నవిన్నపం

    మీరు కామెంట్లకి ఈ word protection తీసేయండి...చిరాగ్గా ఉంది అస్తమానం ఆ పదం టైప్ చెయ్యడానికి.

    రిప్లయితొలగించండి
  3. @sowmya
    ఆ సైకిలు అనుబవము మరి రాయండి..
    అన్నట్టు word protection ముచ్చట నాకైతే సమజుగాలేదు..ఇంగొంత ఇవరన ఇవ్వగలరు.

    రిప్లయితొలగించండి
  4. అయ్యబాబోయ్ తెలియకుండా word verification వాడేస్తున్నరా?
    మీకు కామెంటు రాసినప్పుడల్లా ఇంగిలిపీసులో ఒక పదమిస్తారు. దాన్ని మనం అచ్చు గుద్దినట్టు అట్టానే రాసేయ్యాల, అప్పుడే నా కామెంటు మీ బ్లాగులో పబ్లిష్ అవుద్ది....గిప్పుడు సమజైందా?

    మీరు వెంటనే మీ డాష్ బోర్డ్లో కామెంట్ మోడరేషన్ కి వెళ్ళి అక్కడున్న ఆప్షన్లు ఒక్కసారి సరిగ్గా బాగా చదవండి. అల్లదగిగదిగో అక్కడ కనిపిస్తుంది ఈ మోడరేషనాస్త్రం. అందులో వర్డ్ వెరిఫికేషన్ కి తగిలించున్న టిక్ మార్క్ తీసేయండి. మీ పుణ్యముంటుంది.

    రిప్లయితొలగించండి
  5. సౌమ్య గారికి దండిగా ధన్యవాదాలు..ఎట్లజెప్పిండ్రో అట్లజేసిన..
    సౌమ్యమైన సలహ ఇచ్చినందుకు సంతోసం.

    రిప్లయితొలగించండి
  6. @what to say about me!!
    thanq.
    @murali
    ధన్యవాదాలు.. ఆ సైకిలు ఏమయ్యిందన్నదానిమీద మరోకత ఉంది..అది త్వరలోనే..

    రిప్లయితొలగించండి