"ముక్కలుకాబడ్డ పాము సూర్యాస్తమయం లోపు ఒక్కదెగ్గరికి చేర్చబడితే తిరిగి ఆ పాము జీవం పోసుకొని వయ్యరంగా బుసలుకొట్టును" అని అమెరికాలో ఓ మూడనమ్మకం..దీన్ని ఆధారం చేసుకొని అనైకమత్య బ్రిటీష్ అమెరికన్ ప్రాంతాలను ఏకతాటి మీదికి తెచ్చే సంకల్పంతో 1754 లో బెంజిమన్ ఫ్రాంక్లిన్ అనే ఒ పెద్దాయన "పెన్సిల్వేనియన్ మెగజెట్"లో ఓ కార్టూనేశాడు..ఎనిమిది ముక్కలైన పాము మీద ఎనిమిది ప్రాంతాలను గుర్తిస్తూ "జాయిన్ ఆర్ డై"[కలిస్తే కలువ్..సస్తే చావ్] అంటూ వేసిన కార్టూన్ ప్రభావం అమెరికన్ విప్లవంలో చెరగని ముద్దరేసింది.
ఇట్లా చెరగని ముద్దర్లేస్తూ గీస్తున్న కార్టూనిస్టుల్లో ఇండియా తరుపున సుభాని గారు ఒకరని నా అభిప్రాయం.
ఓ చేత్తో జారుతున్న చెడ్డిని పైకి లాక్కుంటూ మరో చేత్తో ఆంధ్రభూమి లో సుభాని ఇలస్ట్రేషన్లు,D.C కార్టూన్లు చూసిన అనుభవముంది నాకు.
1998 జూన్లో బట్టతలతో అబ్దుల్ కలాం క్యారికేచర్ మిజైల్ మాదిరిగా గీస్తున్న ఒకాయన కనిపిస్తే కలిసి మాట్లాడాను.నేనూహించిన సుభానికి చూస్తున్నసుభానిముకానికి ఎక్కడా పొంతనలేదు..సమ్మందంకూడా లేదు.కాని అతను సుభానినే.
పదేళ్ళు సుభాని గారితో కలిసి ఆంధ్రభూమిలో కార్టూన్లేశా..పేపర్ లేకపోతె అడిగేవోన్ని...రబ్బర్ లేకపోతె అడిగేవోన్ని...పెన్సిల్ ముక్కు ఇరిగిపోతే అడిగేవోన్ని..అయిడియాలేకపోయినా అడిగేవోన్ని..!
సుభానిగారికి కట్ ఆయ్యె ఇన్ కమ్ టాక్స్ లో సగం వుండేది నా జీతం.
విశాలనేత్రుడు,ఆజానుబావుడు,చక్కటి మేనిచాయ అని నేను అననుకాని..చదువుకున్నకార్టూనిస్ట్ అని చెప్పగలను..అంత మాత్రంచేత గర్వవతుడు మాత్రం కాదు.తక్కువమాట్లాడతాడు..తక్కువ మాట్లాడే బొమ్మలున్న కార్టూన్లే వేస్తాడు..ఇంటర్నల్ పాలిటిక్స్ కంటే కరెంట్ పాలిటిక్స్ పైనే ఫోకస్ ఎక్కువ.జర్నలిస్ట్ క్ ఇన్ స్టింక్టు ఇంకు బాటిల్ సంపాయించి పెట్టుకున్నాడు.
సుభాని గారు గీసిన "గ్రేట్ వాల్ ఆఫ్ చైన" కంపొజిషను ఉంకో పదేళ్ళయినా నేను గీయలేనని చాతి విరుచుకొని చెప్పగల్ను.చంద్ర గారి ఇన్ ఫ్లూయేన్స్ ఉన్నట్టు నాకు డవుటు.
ప్రతిష్టాత్మక యుధ్ వీర్ అవార్డు అందుకున్న సు"బాణి" కి అభినందనలు.
[సంపాయిస్తున్నది నెలకు లక్షా,అర లక్షా కాదు,మన బంగారం మార్కెట్లో క్యారెట్టా,కాడ్మియమా,రోల్డుగోల్డా? ఏకంగా కాకిబంగారమా ??? ]
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆయనకి అభినందనలు, మీకు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిమీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసుభాని గారికి యుధ్వీర్ అవార్ద్రావదం చాలా అభినంధనీయం నెను రెగులర్గా దెక్కన్ క్రానికల్ పథ్రిక చదువుథను ఆయన కార్తూన్స్ చాల బాగుంతాయి
రిప్లయితొలగించండిఈ సంధర్బముగ మీ విష్లెషన చాల బాగుంధి