5, మే 2010, బుధవారం

నంజుకోడానికి ఆర్కెలక్ష్మణ్..చప్పరించాడానికి బాపు..


శిల్పారామం దాటి ఓ కిలోమీటరు పోయి రైటు తిరిగితే "ది స్పైస్ విలేజ్"వస్తుంది..
రోజూ తినే రొటీన్ తిండి బోరుకొట్టి ఆల్టో కారేసుకొని ఓ ఐదుగురం ది స్పైస్ విలేజ్ కెళ్ళాం..అద్దాలమేడ..సెకండు ఫ్లోరుకెళ్ళి ఈసారి లెఫ్ట్ తిరిగి మూలమీద కూర్చున్నాం..
అందరిటేబుళ్ళమీద బాపు,ఆర్కెలక్ష్మన్ కార్టున్లు వడ్డించాడు సర్వర్..దిమ్మదిరిగింది..ఉరే రామేశ్వర్ వెళ్ళినా మిష్టర్ శనీశ్వర్ తప్పడా??అనుకున్నా..
"ఇదేందిబై అన్నానికొస్తే విస్తర్లు వేయకుండా సెటైర్లు వేస్తారేం?"అన్నాన్నేను..ఇక్కడంతే బై అన్నాడువాడు..కార్టున్లు చూస్తూ భలే ఎంజాయ్ చేసారు "ది స్పైస్ విలేజ్" కస్టమర్లు.. వంటలు లేటయితే వాడి మాడుపగులుతుందని మనకు సంకలగులగుల పెట్టే ప్రయత్నం తాలూకు కాన్సెప్టు అయ్యుంటుంది.
కార్టూను పోస్టర్లమీద ప్లేట్లు,వాటిమీద బోయినం,నంజుకోడానికి ఆర్కెలక్ష్మన్..మజ్జిగలో చప్పరించాడానికి బాపు..భలే భోయినం..బ్రేవ్!!
"ఈ ఇషయం కూడా రాస్తారా?ఏంది..బ్లాగులో..?"అన్నారు తోటి ఎంప్లాయీస్...
ఇంకేం అన్నంతపనయ్యింది..!
{శిల్పారామం ఒసారెళ్ళి "ది స్పైస్ విలేజ్"కి దారెటూ?అనడగండి చాలు తర్వాత వాడే చూసుకుంటాడు.}

2 కామెంట్‌లు:

  1. సిరంజీవీ, నీబలాగులన్నీ సదివా. కొంతమంది బ్లాగుల్లో ఇంగిలీసు వాడకం సూస్తుంటే ఎగుటుగుంటది. నీది మాత్తరం సూపరు, ఎదురుబొదురుగా నుంచోని కబుర్లు సెప్తున్నట్టే ఉంది బై.

    రిప్లయితొలగించండి
  2. అబ్బో ..మీకు థాంకులు అండ్ ధన్యవాద్స్.

    రిప్లయితొలగించండి