9, మే 2010, ఆదివారం

మనసున మల్లెల మాలలూగెనే..

సుట్టాలింటికెళ్ళాక ఈ మాటా ఆ మాటా అయిపోయి,ఇంగ తిరిగి ఇంటికొచ్చెద్దామనుకునేసరికి మాట నెత్తిలో తురుముకునే మల్లెపూల దగ్గరికెళ్ళింది.
"ఏమోనండీ..మల్లెపూలు పెట్టుకునే అలవాటైతే లేదునాకు..సిన్నప్పట్నుంచి కూడా ఆ పూల వాసన పడదునాకు"అంది ఆ ఇంటావిడ.
"అట్లాంటప్పుడు ప్రతి నాలుగు మల్లెపూల మధ్యన ఒహ వట్టిచాప[ఎండు చేప] చొప్పున అల్లి పెట్టుకోవచ్చుగదా..పీలిస్తే గుమగుమ..సూస్తే స్రుజనాత్మకత.."
అని ఓ ఉచిత సలహా పారేసి వచ్చిన.
వొకర్తో వొకరికి ఈ మాత్రం తమాస గూడ లేకుంటే ఇంగ మిగిలింది అమాసేనబ్బా!
[శాంతాడంత నల్లటి జడ మీద బొక్కెన నిండ తెలతెల్లటి మల్లెపూల కలరు కాంబినేషను,కంపొజిషను బలే బాగుంటది.]

3 కామెంట్‌లు:

  1. హ హ హ ... బాగుందండి.... ఈ మధ్యే మీ బ్లాగు చూసా ... అసలు సిసలు తెలంగాణా యాసలో చూడముచ్చటగా ఉండి, ఎకబిగిన అన్ని పోస్టులు నాతో చదివించేసింది. నేనూ తెలంగాణా వాడినే అయినా మీలా రాయలేక పోతున్నా ...

    రిప్లయితొలగించండి
  2. @అజ్నాత
    ధన్యవాదాల్సార్.
    భాష ఏదైతేనేం ఘోష ఒక్కటే గదాసార్.
    అన్నట్టు మిమ్మల్ని తెలుగులో ఏమంటారు సార్?

    రిప్లయితొలగించండి
  3. పేరు ల ఏమున్నది సారూ ..... తెల్సినోల్లంతా నన్ను సిద్ధార్థ్ అంటరు ... (ఇప్పుడచ్చింది జరంత తెలంగాణ భాష)

    రిప్లయితొలగించండి