4, మే 2010, మంగళవారం

మానాయిన తీర్పు

మస్నం పెంటయ్య.మస్నం చిన్నయ్య అన్నదమ్ములు.మా ఊరిపొలిమెరల్లో వుంటాయ్ వాళ్ళిళ్ళు..అన్నదమ్ములు అచ్చం అన్నదమ్ముల్లాగే వుంటారు.వాళ్ళు కట్టుకున్న ఇండ్లుమాత్రం అచ్చం అమ్డాల[twins]పిల్లల్లాగుంటాయ్..
ఒకప్పుడు వాళ్ళు మా ఇంటి ఎనకాల ఇంట్లో వుండేవోళ్ళు[అది మా చిన్నకాకయ్య వాళ్ళది].మగ్గం నేయగా సంపాయించిన డబ్బుల్తో సొంతంగా ఇండ్లు కట్టుకునే స్థాయికి ఎదిగిపోయి పొలిమెరకెళ్ళిపోయారు.
పెంటయ్య భార్య రాములమ్మ వీళ్ళిద్దరూ మా ఇంటెనకాల వున్నన్ని రోజులు కాపురం బానే చేసేవోళ్ళు..ఎందుకంటే మేం వుండే కాలనీలో మా నాయిన పలుకుబడి తాలూకు వైబ్రేషను నలుదిక్కులా కిలోమీటరు వరకుండేది..ఎవరింట్లో పంచాయతీ అయినా మా నాయిన తశ్వె[solve] చేయాల్సిందే..ఏ పెళ్ళాం మొగుడు పీకులాడాలన్నా మానాయిన పర్మిషన్ అవసరం అయేటట్టుండేది అక్కడ పొజిషను.బొంగురుగొంతుతో పెంకుటిల్లు టాపులు లేచిపోయేటట్టుండేయి మా నాయిన తీర్పులు.వెనకా ముందులు మొగమాటాల్లేకుండా వుండేయి వాదనలు..
దేశనాయకుల బొమ్మలు బట్టపై నేయడం,కొత్తకొత్త డిజైన్లు కనిపెట్టడం,కుట్టకుండా ప్యాంటు షర్టు నేయడం,అగ్గిపెట్టెలో పట్టేచీర నేయడం.. లాంటి ఎక్స్ పెరిమెంట్లు చేయడం మూలాన మా నాయినను కలవడానికి థాయిలాండ్,ఆఫ్రికా,జపాన్,మలేషియా,సింగపూర్,పారిస్,అమెరికా.....ల నుంచి ఫ్యామిలి ఫ్యామిలీతొపాటు టిఫిన్ బాక్సులు కట్టుకొని మరీ మా ఇంటిని దర్శించడంవల్ల మా నాయిన ప్రతిష్ట వద్దువద్దన్నా అమాంతం పోచంపల్లి పొలిమెరలు దాటి ఎటో ఎళ్ళిపోయింది..అందుకే మా ఊళ్ళో మా నాయినన్నా,మా నాయిన తీర్పులన్నా ఎనలేని గౌరవం.
పెంటయ్య,రాములమ్మలు మాఇంటికి దూరంగా ఊరిపొలిమెరల్లోకి ఎళ్ళిపోవడం..రోజూ గొడవలు షురూ కావడం ఏకకాలంలో జరిగిపోయాయి.ఇద్దరికీ క్షణం పడకపోవడం..తీర్పులకోసం మా నాయిన దగ్గరికి నువ్వానేనా?అన్నట్టు రన్నింగ్ పోటీలు..ఈవిడ గురించి ఆయన,ఆయన గురించి ఈవిడ..ఇదే తతంగం..
అసలు గొడవేంటని ఆరాతీస్తె తెలిసిందేంటంటే సదరు రాములమ్మకు దైవభక్తి రోజు రోజుకు పెరిగిపోయి పతిభక్తిని పక్కకుపడేసింది..వేళకు భర్తగారిని ఎండబెట్ట
డం..భార్యాభర్తలు చేయాల్సిన పనులు ఏవీ జరిగేయికావు..ఈవిడకు భక్తి పెరిగిపోవడం,ఆయనకు బీ.పీ పెరిగిపోవడం...లేసింది మొదలు ఇదే డ్యూటి..పెంటయ్యకు సావు గోస పాపం..పొద్దస్తమానం దేవుడిరూములోనే రాములమ్మకు డ్యూటి.దేవుడి రూముని చక్కగాపేడతో అలికి పసుపుకుంకుమతో బొట్లు అలంకరించి ధూపధీప నైవేద్యాలను దేవుడికి అర్పించి ఆనక పెంటయ్యకు సమర్పించేది...తరవాత ధ్యానముద్రలోకి జారుకునేది రాములమ్మ.
రాములవ్వ.పెంటయ్యతాతలమనేవాళ్ళం మేము..
ఇంటిపై,ఒంటిపై ధ్యాసే లేకుండా చక్కగా శుభ్బరంగా దీపాలు ఎలిగించడం..నన్ను ఎండబెట్టడం"ఇదీ పెంటయ్యగారి ప్రథమ ఫిర్యాదు..
ఈ పంచాయతీ తీర్పుకు మా పోచంపల్లి హేమాహేమీలంతా హాజరయ్యి తోచిన తలా ఓ తీర్పు చెప్పారు..మానాయిన తీర్పు మిగిలిపోయింది..అంతా ఉత్కంటా..తీర్పు ఎలావుంటుందని...
"దేవుడికి ఇన్ని సార్లు నైవేద్యం పెడుతున్నావ్..పూజలు చేస్తున్నావ్..దీపాలు ఎలిగిస్తున్నావ్..అయినా మీ ఇంట్లో శాంతి వుంటలేదు అవునా?" అనడిగాడు రాములమ్మని మానాయిన.
"అవును"అంది రాములమ్మ
"అందుకని దీపాలు ఎప్పుడుపడితే అప్పుడు ఎలిగించకు."అన్నడు మా నాయిన
మరెప్పుడు ఎలిగించమంటావ్? అంది రాములమ్మ
"కరెంటు పోయినప్పుడే ఎలిగించు" ఫైనల్ గా మా నాయిన తీర్పు.
ఊరి జనం నోరెల్లబెట్టిన ఎక్స్ ప్రెషను మళ్ళీ వర్ణించడం కూడానా??
1998వ సంవత్సరంలో కోఠీ సుల్తాన్ బజార్లో రాములమ్మ ఒక్కతే గుర్తుపట్టరానివిధమైన వేషంతో వేగంగా ఫుట్ పాత్ పై నడుచుకుంటూపోతూంటే బస్సులోంచి చూసా..తర్వాత కొన్నిరోజులకే చచ్చిపోయింది రాములమ్మ.
[ఆరోగ్యం,అయిశ్వర్యం కోసం పూజలు చేసి ఉపవాసాలుంటే అవిరావు..గ్యాస్టిక్ ట్రబుల్ వస్తుంది____మానాయిన]

5 కామెంట్‌లు:

  1. ఆరోగ్యం,అయిశ్వర్యం కోసం పూజలు చేసి ఉపవాసాలుంటే అవిరావు..గ్యాస్టిక్ ట్రబుల్ వస్తుంది" మీ నాయనగారు quote అదుర్స్, చాలా బాగుంది.

    అంత నిబద్ధతతో ఉన్న మీ నాయనగారికి పుట్టిన మీరు ధన్యులు!

    రిప్లయితొలగించండి
  2. mee muccatlu baagunnayi. inkonchem opika chesukoni rayalsindi. alaage kaasta inti basha, kaasta patrika bhasha kalisi unnayi. adi kooda teeseste iragadeese Tapaa ayyEdi.

    రిప్లయితొలగించండి
  3. బలె బలె. మీ నాయన గరు బలె చెప్పరు

    రిప్లయితొలగించండి
  4. @sowmaya
    థాంక్సండి సౌమ్యగారు.
    @murali
    పోటీకి మీ మాటలూ వచ్చిచేరేటట్టున్నాయ్.
    @ajnaatha
    నిజమేనండి అజ్ఞాత గారు..సిటీలో పాడు స్నేహాలు ఎక్కువయ్యి భాష మారిపోతోంది..లేకపోతే ఈ "బాష"కు తిరుగేలేదు.
    @మిరియప్పొడి
    ధన్యవాదాలండి..

    రిప్లయితొలగించండి