15, ఏప్రిల్ 2010, గురువారం

ఒకాయన

మా ఊళ్లో "ఒకాయన"కు[పేరు మార్చబడినది] పెళ్లీడొచ్చింది..పెళ్లిసూపులు...
అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు,ఆమె తండ్రి కూడా సక్కదనంతో తొణికిసలాడాలి..మామగారి ముఖం చూస్తే మతి పోగొట్టేట్టుండాలి..ఇదీ "ఒకాయన" కండిషను.ఫస్టునైట్ కు మామగారు నాట్ ఎలౌడ్ అన్నా విన్లే.
అద్దకిల పౌడరు ముఖానికి రాసి ..పెళ్లిసూపుల డ్యూటీకి బయల్దేరేవాడు...
పెళ్లిసూపులు___ కుండెడు వడియాలు కూసుండి మెక్కడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ అటుకులు గటుక్కున మింగడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ అడ్డెడు శనిగలను ఆగమాగం బుక్కడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ గంపెడు గారెలు గరగర నమలడం..బయటపడడం..
సూస్తా,సూస్తా వందకి పైగా పెళ్లిసూపులు..బ్రేవ్ లు.. కాని నో కాంప్రమైజు..
కొసకు ఓ అందమైన పిల్లకు జనమ నిచ్చిన హ్యండ్సమ్ జనకుడు దొరికాడు..
ఇంకేం, అంగరంగ వైభవంగా విస్తరాకులు,టెంటు,భాజాభజంత్రీలు,"ఒకాయన", బోయినం....
.................... .............
ఓ పదేళ్లు తిరక్కుండానే ఆ "ఒకాయన" బార్య చచ్చిపోయింది.
సూరీడు పడమటి కొండల్లో ఇంకిపోతుండగా దహనసంస్కారాలు..
లాంగ్ షాట్ "సిల్ హౌట్" లో మామగారి పక్కనే "ఒకాయన" .

3 కామెంట్‌లు:

  1. .................... .............
    ఈ చుక్కలపైనున్నయ్యన్నీ అర్ధమైనయ్ గానీ కిందయ్ మాత్రం అస్సలర్ధంగాలా

    రిప్లయితొలగించండి
  2. ఇంకానయం..చుక్కలు మాత్రమే అర్థమయ్యాయన్లేదు.

    రిప్లయితొలగించండి
  3. తెలుగు తెగులయ్యినట్టు టపాలో ''మస్టేకు'' [పేరు మార్చబడినది] దొర్లింది ఒక్క కట్ అండ్ పేస్టు తో సరి చేసా ....సదివి సూడు......


    మా ఊళ్లో "ఒకాయన"కు[పేరు మార్చబడినది] పెళ్లీడొచ్చింది..పెళ్లిసూపులు...
    అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు,ఆమె తండ్రి కూడా సక్కదనంతో తొణికిసలాడాలి..మామగారి ముఖం చూస్తే మతి పోగొట్టేట్టుండాలి..ఇదీ "ఒకాయన" కండిషను.
    అద్దకిల పౌడరు ముఖానికి రాసి ..పెళ్లిసూపుల డ్యూటీకి బయల్దేరేవాడు...
    పెళ్లిసూపులు___ కుండెడు వడియాలు కూసుండి మెక్కడం..బయటపడడం..
    పెళ్లిసూపులు___ అటుకులు గటుక్కున మింగడం..బయటపడడం..
    పెళ్లిసూపులు___ అడ్డెడు శనిగలను ఆగమాగం బుక్కడం..బయటపడడం..
    పెళ్లిసూపులు___ గంపెడు గారెలు గరగర నమలడం..బయటపడడం..
    సూస్తా,సూస్తా వందకి పైగా పెళ్లిసూపులు..బ్రేవ్ లు.. కాని నో కాంప్రమైజు..
    కొసకు ఓ అందమైన పిల్లకు జనమ నిచ్చిన హ్యండ్సమ్ జనకుడు దొరికాడు..
    ఇంకేం, అంగరంగ వైభవంగా విస్తరాకులు,టెంటు,భాజాభజంత్రీలు,"ఒకాయన", బోయినం....
    ఫస్టునైట్ కు మామగారు నాట్ ఎలౌడ్ అన్నా విన్లే.
    .................... .............
    ఓ పదేళ్లు తిరక్కుండానే ఆ "ఒకాయన" బార్య చచ్చిపోయింది.
    సూరీడు పడమటి కొండల్లో ఇంకిపోతుండగా దహనసంస్కారాలు..
    లాంగ్ షాట్ "సిల్ హౌట్" లో మామగారి పక్కనే "ఒకాయన"

    రిప్లయితొలగించండి