సరిగ్గా పదేళ్ళక్రితం హైద్రాబాదుకార్టూనిస్టులమంతా నీళ్ల కొరతమీద మంచినీళ్ళు తాగినంత కష్టంగా కార్టూన్లేసి రవీంద్రభార్తిలో ప్రదర్శనొకటి పెట్టాం..వాటిలో ఏరికోరి "హిందు" పత్రికవాళ్లు నా కార్టూన్ని మాత్రమే అచ్చేసి "కళ్ళను కట్టిపడేసే కార్టూన్లు"అంటూ వ్యాసం రాసారు.కుండలో నీళ్ళకోసం వంగిన ఓ బాల్ కిషన్ నీళ్ళు దొరక్క తనే కుండలోకి ఇంకిపోతాడన్నమాట..
ఇదిలా వుంటే..........,,,
అధీనరేఖవద్ద కాల్పులు,లోతట్టుప్రాంతాలు జలమయం,ఉగ్రవాదంపైఉక్కుపాదం,అమరవీరులకు అశ్రునివాళి..లాంటి అవకతవక కంగాళి వార్తలు సదివి సదివి ఆటిపై కార్టూన్లు గీసి గీసి బోరు భరించలేక బోరున ఏడుస్తున్న సన్నివేశంలో పతంజలి సారు డస్టుబిన్నుసురేశ్ గాడు జాడిచ్చితంతే ఎల్లి పంజాగుట్ట ఫ్లైఓవర్ప్ పక్కసందులో "మాయా" సాఫ్టువేర్లో వర్కుచేసుకుంటున్న సత్య మెడలమీదపడ్డా...ఇంకేమ్ "మాయా" సాఫ్టువేర్లో ఎచ్చుల పుడింగినైపోయానని వేరే చెప్పాల్నా??పేపర్ కోసం ఎలగబెట్టిన కార్టూను "మయా"లో చేస్తే ఎట్లుంటదో ఒ చిన్న ట్రయలు వేసా...పైన వీడియో నొక్కీవక్కానించండి.దీన్నే కొంతమంది"కలల సీతాకొకచిలకల వెంట...." అంటారు.....నేనేమో "క్యారెట్ బిఫోర్ ది కార్ట్ " అంటాను.
hi..
రిప్లయితొలగించండిThe cartoon is very funny and thought-provoking :) . The video,i felt , is a bit abrupt.
అన్నా వీడియో కేక..
రిప్లయితొలగించండినువ్వు నిజంగా పుడింగివే..!
@what to say about me!!
రిప్లయితొలగించండివీడియో అనగానే,సైన్మ చూసినట్టు చూద్దామనుకుంటే ఇదే ప్రాబ్లెం..
అందుకే ఆ abrupt ఫీలింగు.
@nagamahan
"పుడింగు" అన్నపదం కేవలం ఎఫెక్టు కోసమే..
శ్రీ దేవి "పేద్ద పుడింగిలాగా...."అని "క్షణ క్షణం"లో 'డీలా'గు.
రిప్లయితొలగించండిNice Cartoon.
Animation - మీరే చేసారా,క్లుప్తంగా బాగున్నది.
yes.i did it.thanq for the comment.
రిప్లయితొలగించండిur blog is wonderful.
antha pedda kunda ippudu hyd lo janalu unde illu laaga undemo bahusha
రిప్లయితొలగించండి